ఉప్పల్ లో 22-A సమస్యను పరిష్కరించాలి

ఉప్పల్, ఆగస్టు 13, (తెలంగాణ దిశ) : ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించిన 22-A భూముల సమస్యపై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జిల్లా కలెక్టర్ మనూ చౌదరిని కలిసి చర్చించారు. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో 22-A కారణంగా ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యను పరిశీలించి తగిన పరిష్కారం చూపించాలని కోరారు. అర్హులైన ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.