ఈ నెల 26న వికలాంగుల వాయిస్ మాస పత్రిక 12వ వార్షికోత్సవాలు

హైదరాబాద్, ఆగస్టు 21, (తెలంగాణ దిశ) : వికలాంగుల హక్కులు, సమస్యలు, సంక్షేమ పథకాలపై చైతన్యం కల్పిస్తూ కొనసాగుతున్న వికలాంగుల వాయిస్ మాస పత్రిక 12వ వార్షికోత్సవ ఉత్సవాలను ఈ నెల 26న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మధ్యాహ్నం ఒకటింటికి నిర్వహించనున్నట్లు పత్రిక గౌరవ సలహాదారులు పి. ఉమ్మర్ ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా “రాజ్యాంగ హక్కులు – భావప్రకటన స్వేచ్ఛ – సవాళ్లు” అనే అంశంపై ప్రత్యేక సెమినార్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వార్షికోత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను హెలెన్ కెల్లర్ విద్యా సంస్థల ప్రాంగణంలో...