అమ్మనబోలులో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు

భువనగిరి, ఆగస్టు 18, (తెలంగాణ దిశ) :  సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతిని పురస్కరించుకుని అమ్మనబోలు గ్రామంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, గౌడ సంఘం పెద్దలు, గౌడ యువజన సంఘం నాయకులు పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌కు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను స్మరించుకున్నారు....