ఈసీఐఎల్‌లో ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు
కుషాయిగూడ, ఆగస్టు 18, (తెలంగాణ దిశ) : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతిని పురస్కరించుకుని గౌడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మేడ్చల్-మల్కాజిగిరి ఆధ్వర్యంలో ఈసీఐఎల్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గౌడ జేఏసీ రాష్ట్ర కో-కన్వీనర్ ముత్యం ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ ట్యాంక్ బండ్‌పై పాపన్న విగ్రహాన్ని నెలకొల్పడం అభినందనీయమని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలని, గీత కార్మికుల ఎక్స్‌గ్రేషియాను...