ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమంపై కీలక సమీక్ష

వర్గీకరణ ముసాయిదాపై చర్చ.. త్వరలో ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు అవకాశం హైదరాబాద్, ఆగస్టు 18, (తెలంగాణ దిశ) :  తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పనపై తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ కీలక సమీక్ష నిర్వహించింది. కమిటీ చైర్మన్ డాక్టర్ కె. కేశవరావు (కేకే) నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్, కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు మోతె శోభన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్. రాములు నాయక్ తదితరులు...