జమ్మిగడ్డలో ఘనంగా ఫలహారం బండి ఊరేగింపు
ఏఎస్ రావునగర్, ఆగస్టు 16, తెలంగాణ దిశ) : ఏఎస్ రావునగర్ డివిజన్ పరిధిలోని జమ్మిగడ్డ భగత్‌నగర్ కాలనీలో ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమాన్ని ఆదివారం భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించారు. పడాల ఆనంద్ చారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానికులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. ఫలహారం బండిని ప్రత్యేకంగా అలంకరించి భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. మహిళలు, యువత సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని సందడి చేయగా, భక్తి గీతాలు, డప్పు...