సర్-2026లో కృషి చేసిన బిఎల్ఏలు, సీనియర్ నాయకులకు ఘన సన్మానం

కుత్బుల్లాపూర్, ఆగస్టు 13, (తెలంగాణ దిశ) :  సర్-2026 కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అంకిత భావంతో పని చేసిన కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏలు, సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులను బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా సన్మానించారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజాంపేట్, బండారి లేఔట్, బాచుపల్లి డివిజన్లకు చెందిన బిఎల్ఏలు, సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్, ఎంపీ...