కీసరలో పురాతన బొడ్రాయి స్థలాన్ని కాపాడాలి
కీసర, ఆగస్టు 25, (తెలంగాణ దిశ) : కీసరలోని సర్వే నంబర్ 329లో ఉన్న పురాతన బొడ్రాయి స్థలాన్ని కబ్జాల నుంచి కాపాడాలని కోరుతూ కీసర మాజీ ఉప సర్పంచ్ తటాకం లక్ష్మణ్ మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. బొడ్రాయి ఉన్న ప్రాంతాన్ని కొందరు ఆక్రమించి, చుట్టూ ప్రహరీ నిర్మించినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ప్రాంతం మీదుగా కీసర గ్రామానికి చెందిన పలువురు ప్రజలు పురాతన శివాలయంతో పాటు తమ పొలాలకు రాకపోకలు సాగిస్తుంటారని లక్ష్మణ్ తెలిపారు....