సైబర్‌ నేరాలపై ఈసీఐఎల్‌ చౌరస్తాలో అవగాహన మానవహారం

కుషాయిగూడ, ఆగస్టు 27, (తెలంగాణ దిశ) : సైబర్‌ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చేపట్టిన అవగాహన కార్యక్రమంలో భాగంగా గురువారం ఈసీఐఎల్‌ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్‌ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మోసగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఆన్‌లైన్‌ మోసాలు, అనుమానాస్పద ఫోన్‌ కాల్స్‌, సందేశాలు, నకిలీ లింకులు, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు తదితర అంశాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్‌ నేరగాళ్లకు...