భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మల్కాజిగిరి పార్లమెంట్ కో-కన్వీనర్‌గా చల్లా ప్రభాకర్

కుషాయిగూడ, ఆగస్టు 19, (తెలంగాణ దిశ) :  భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మల్కాజిగిరి పార్లమెంట్ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో మల్కాజిగిరి పార్లమెంట్ కో-కన్వీనర్‌గా చల్లా ప్రభాకర్‌ను నియమించారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రావినూతల శశిధర్, కార్యదర్శి నాయిని బుచ్చిరెడ్డి కలిసి చల్లా ప్రభాకర్‌ను మల్కాజిగిరి పార్లమెంట్ కో-కన్వీనర్‌గా నియమిస్తూ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన చల్లా ప్రభాకర్‌కు పలువురు నాయకులు, కార్యకర్తలు, గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అభినందనలు తెలిపారు. గణేష్ ఉత్సవాలను...