న్యూసెన్స్‌కు చెక్.. నలుగురికి కమ్యూనిటీ సర్వీస్ శిక్ష
చర్లపల్లి, ఆగస్టు 13, (తెలంగాణ దిశ) : చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని ఈసీ నగర్ లో అద్దె ఇంట్లో రాత్రి వేళ న్యూసెన్స్ చేస్తూ గొడవలకు పాల్పడి స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తున్న నలుగురు వ్యక్తులపై చర్లపల్లి పోలీసులు ఈ-పెట్టీ కేసు నమోదు చేశారు. అనంతరం వారిని కుషాయిగూడ కోర్టులోని గౌరవ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. కేసును విచారించిన మేజిస్ట్రేట్ గురువారం నలుగురికి కమ్యూనిటీ సర్వీస్ శిక్ష విధించారు. ఇందులో భాగంగా ఒక గంట పాటు ట్రాఫిక్ విధుల్లో పోలీసు సిబ్బందికి సహకరించాలని ఆదేశించారు....