కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను నిర్వీర్యం చేయొద్దు

బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి హైదరాబాద్, ఆగస్టు 17, (తెలంగాణ దిశ) : పేదింటి ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలుస్తున్న కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను నిర్వీర్యం చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఈ పథకాలపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసనల్లో భాగంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు హబ్సిగూడ చౌరస్తాలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమశేఖర్...