దోమల నివారణకు ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలి
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాచారం 21వ డివిజన్ ఎర్రగుంట ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దోమల ద్వారా వ్యాప్తి చెందే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నివారణపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కూలర్లు, పూల కుండీలు, కొబ్బరి చిప్పలు, పాత టైర్లు తదితర వాటిలో నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా...