రాఖీ బంధంతో విద్యార్థుల్లో సోదరభావం.. దేశ రక్షణకు ఐక్యంగా నిలుద్దాం

నాగారం సెరినిటీ పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు నాగారం, ఆగస్టు 27, (తెలంగాణ దిశ) :  అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు, ఆత్మీయతకు, పరస్పర రక్షణకు ప్రతీకగా రక్షాబంధన్‌ (రాఖీ పౌర్ణమి) పండుగను జరుపుకుంటామని సెరినిటీ ముఖ్య కార్యదర్శి నోముల వసంత రెడ్డి పేర్కొన్నారు. రక్షాబంధన్‌ కేవలం సోదర సోదరీమణుల మధ్య అనుబంధానికి మాత్రమే కాకుండా, పరస్పర ప్రేమ, విశ్వాసం, బాధ్యత, రక్షణకు ప్రతీకగా నిలిచే పవిత్రమైన పండుగ అని అన్నారు. గురువారం నాగారంలోని సెరినిటీ పాఠశాలలో రక్షాబంధన్‌ వేడుకలను విద్యార్థులు ఘనంగా...