న్యూస్ రూమ్ నుంచి వాట్సాప్ వరకు.. మారుతున్న రాజకీయ సమాచార వ్యవస్థ
హైదరాబాద్, ఆగస్టు 19, (తెలంగాణ దిశ) : ఒకప్పుడు రాజకీయ నాయకులు తమ కార్యక్రమాలు, ప్రకటనలు, ఫొటోలను పత్రికా కార్యాలయాలకు పంపించి, వాటిని ప్రజలకు చేరవేయడానికి విలేకరులపై ఆధారపడేవారు. అయితే సాంకేతిక పరిజ్ఞానం విస్తరించడంతో రాజకీయ సమాచార ప్రసార విధానం పూర్తిగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్లు, సామాజిక మాధ్యమాలు, వాట్సాప్, కృత్రిమ మేధస్సు ఆధారిత వీడియోల రాకతో రాజకీయ నాయకులు తమ సందేశాలను నేరుగా ప్రజలకు చేరవేసే పరిస్థితి ఏర్పడింది. గతంలో ఒక రాజకీయ కార్యక్రమానికి సంబంధించిన వార్త ప్రజలకు చేరాలంటే విలేకరి, పత్రికా సంస్థ,...