పేదల భూములు గుంజు కుంటే ఊరుకోం.. రేవంత్ సర్కార్‌ మెడలు వంచుతాం: ఈటల రాజేందర్

కుత్బుల్లాపూర్, ఆగస్టు 17, తెలంగాణ దిశ) : భౌరంపేటలో దళిత రైతుల భూముల సమస్యపై జరుగుతున్న ఆందోళనకు మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ మద్దతు తెలిపారు. సోమవారం దుండిగల్‌ భౌరంపేటలో ధర్నా చేస్తున్న దళిత రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత రైతులతో కలిసి వివాదాస్పద భూములను పరిశీలించారు. భౌరంపేటలోని సర్వే నంబర్లు 472, 166లో దళితులు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తోందని రైతులు ఈటల రాజేందర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఐదు...