జెన్–జీ యువత ఆలోచనలకు వేదిక.. తీన్మార్ మల్లన్నతో ముఖాముఖి
ఏఎస్ రావునగర్, ఆగస్టు 21, (తెలంగాణ దిశ) : “మీ గొంతు–మా లక్ష్యం” అనే నినాదంతో జెన్–జీ యువత కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 24వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు ఈసీఐఎల్ చౌరస్తా సమీపంలోని రౌండ్ బిల్డింగ్ టీజీఐఐసీ కాలనీ గ్రౌండ్‌లో ఈ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో యువతీ యువకులు నేరుగా ముఖాముఖి సంభాషించే అవకాశం కల్పించనున్నారు. యువత ఆలోచనలు, ఆశయాలు, ఎదుర్కొంటున్న సమస్యలు,...