ఉత్తమ దర్యాప్తు అధికారిగా కుషాయిగూడ ఎస్‌ఐ వెంకన్నకు పురస్కారం

కుషాయిగూడ, ఆగస్టు 22, (తెలంగాణ దిశ) : విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచి, కేసుల దర్యాప్తులో సమర్థవంతంగా వ్యవహరించిన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఎన్. వెంకన్నకు ఉత్తమ దర్యాప్తు అధికారి పురస్కారం లభించింది. నేరేడుమెట్‌లోని మల్కాజిగిరి కమిషనర్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో మల్కాజిగిరి కమిషనర్ బి. సుమతి ఐపీఎస్ చేతుల మీదుగా ఎన్. వెంకన్న ఈ పురస్కారాన్ని అందుకున్నారు. కేసుల దర్యాప్తులో వాస్తవాలను వెలికితీయడం, ఆధారాలను సేకరించడం, దర్యాప్తును సమర్థవంతంగా పూర్తి చేయడం తదితర అంశాల్లో ఆయన కనబరిచిన ప్రతిభను గుర్తించి ఈ...