న్యాయవాది సుంకర నరేష్‌కు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

ఖమ్మం–హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాన్ని ఢీకొన్న గేదె.. డివైడర్‌ను ఢీకొని ఆగిన కారు ఖమ్మం, ఆగస్టు 24, (తెలంగాణ దిశ) :  ప్రముఖ న్యాయవాది, సామాజిక కార్యకర్త సుంకర నరేష్‌కు ఆదివారం రాత్రి త్రుటిలో ప్రమాదం తప్పింది. విశాఖపట్నంలోని కోర్టుకు వెళ్లి తిరిగి ఖమ్మం మీదుగా హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో ఖమ్మం నుంచి హైదరాబాద్ వైపు జాతీయ రహదారిపై వెళ్తుండగా, మలుపు సమీపంలో అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన గేదె నరేష్ ప్రయాణిస్తున్న వాహనాన్ని బలంగా...