తెలంగాణ ఉద్యోగుల హక్కుల సాధనకు 27న మహా ధర్నా
వేలాదిగా తరలిరావాలని టిఎస్ యుటిఎఫ్ పిలుపు వరంగల్, ఆగస్టు 26, (తెలంగాణ దిశ) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య జిల్లా కార్యదర్శి మేరుగు ప్రసన్న అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ప్రదర్శించిన ఐక్యత, త్యాగం, తెగువే ఉద్యమానికి ఊపిరిగా నిలిచాయని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల న్యాయమైన హక్కులు, సమస్యలు ఇంకా...