రాహుల్ గాంధీపై అక్రమ ఎఫ్‌ఐఆర్‌ను నిరసిస్తూ సెప్టెంబర్ 1న మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన
ఉత్తరాఖండ్‌లో బీజేపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలి గాంధీభవన్‌లో శాంతియుత నిరసనకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పిలుపు హైదరాబాద్, ఆగస్టు 31, (తెలంగాణ దిశ) : లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై ఉత్తరాఖండ్‌లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను ఖండిస్తూ తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తెలిపారు. అఖిల భారత మహిళా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిరసన...