మల్కాజిగిరి యువతి శ్రేయ లక్కప్రగడకు హార్వర్డ్ ప్రతిష్ఠాత్మక స్కాలర్ షిప్
మల్కాజిగిరి, ఆగస్టు 24, (తెలంగాణ దిశ) : మల్కాజిగిరికి చెందిన 22 ఏళ్ల యువతి శ్రేయ లక్కప్రగడ ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ విశ్వ విద్యాలయ స్కాలర్ షిప్‌కు ఎంపికయ్యారు. 2026–27 విద్యా సంవత్సరానికి అందించే ‘లూయిస్ అండ్ ఐడా టాటెల్‌మన్ స్కాలర్ షిప్’ ఆమెను వరించింది. వ్యక్తిగత, విద్యా జీవితంలో ఎదురైన సవాళ్లను అధిగమించి, అసాధారణ పట్టుదల, స్థైర్యాన్ని ప్రదర్శించిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తారు. ఈ నేపథ్యంలో శ్రేయ ప్రతిభను గుర్తించి ఆమెకు ఈ ప్రతిష్ఠాత్మక అవకాశం లభించింది. హైదరాబాద్‌లో హైస్కూల్ విద్యను...