మహిళా కాంగ్రెస్ లో పదవుల కోసం 30లోగా సభ్యత్వాలు పూర్తి చేయాలి

హైదరాబాద్, ఆగస్టు 27, (తెలంగాణ దిశ) :  మహిళా కాంగ్రెస్ నూతన కమిటీలలో పదవుల కోసం ఈ నెల 30 లోగా సభ్యత్వాలు పూర్తి చేయాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ సూచించారు. గత మూడు సంవత్సరాల నుంచి మహిళా కాంగ్రెస్ లో పని చేస్తున్న మహిళలకు సభ్యత్వం ఆధారంగానే పదవులు ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. రాష్ట్ర స్థాయితో పాటు జిల్లా, డివిజన్, మండల, బ్లాక్, మున్సిపల్ స్థాయిలలో నూతన కమిటీలను ఎంపిక చేయనున్నట్లు ఆమె తెలిపారు. వీటితోపాటు జిహెచ్ఎంసి, ఎంఎంసి,...