కాప్రా సర్కిల్ అధికారుల నిర్లక్ష్యంపై ఎంఎంసీ కమిషనర్ ఆగ్రహం..

కాప్రా, ఆగస్టు 21, (తెలంగాణ దిశ) :  మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం కాప్రా మున్సిపల్ సర్కిల్ పరిధిలోని ఏఎస్ రావునగర్ డివిజన్ కమలానగర్, మహేష్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పారిశుద్ధ్యం, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, పట్టణ హరిత హారం, వాణిజ్య లైసెన్సులు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. తనిఖీల సందర్భంగా రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకుపోవడం, ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించకపోవడం, కేబుల్ వైర్ల నిర్వహణలో నిర్లక్ష్యం...