ఖర్గేను అవమానించేలా ‘శుద్ధీకరణ’.. ఇది రాజ్యాంగ విలువలకు విరుద్ధం
మహిళా కాంగ్రెస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ హైదరాబాద్, ఆగస్టు 13, (తెలంగాణ దిశ) : ఇటీవల హల్ద్వానీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీ ప్రదేశంలో హిందూ మితవాద సంస్థలు గంగాజలంతో ‘శుద్ధీకరణ’ పేరుతో ఆచారం నిర్వహించడాన్ని మహిళా కాంగ్రెస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వేదికపై ఉండటం వల్ల ఆ ప్రదేశం ‘అపవిత్రమైందంటూ’ శుద్ధీకరణ చేపట్టడం అత్యంత అవమానకరమైన చర్యగా ఆమె అభివర్ణించారు. ఈ ఘటన బీజేపీ పెంపొందిస్తున్న...