సహచరీలతో మమేకమై పోలీసుల రక్షాబంధన్ వేడుకలు…
కుషాయిగూడ: ఆగస్టు 27, (తెలంగాణ దిశ) : కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సహచరీలతో కలిసి రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు సహచరీలతో మమేకమై, వారి కాలనీలు, పరిసర ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు, వారి దృష్టికి వచ్చే అనుమానాస్పద లేదా అవాంఛనీయ విషయాలను వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సహచరీలు చురుకైన పాత్ర పోషిస్తూ పోలీసులకు సహకరించాలని, తమ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు సమాచారాన్ని పోలీసులకు అందించి, వారితో సమన్వయంతో పనిచేయాలని...