చర్లపల్లి డివిజన్‌లో మంజూరైన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలి : ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
చర్లపల్లి, ఆగస్టు 18 (తెలంగాణ దిశ): చర్లపల్లి డివిజన్‌లో ఇప్పటికే మంజూరైన అభివృద్ధి పనులు పెండింగ్‌లో ఉండటంపై ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మంజూరైన నిధులతో చేపట్టాల్సిన పనులను ఇక ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే ప్రారంభించి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను కోరారు. ఈ మేరకు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, ఐఏఎస్‌ను ఎమ్మెల్యే కలిసి చర్లపల్లి డివిజన్‌లో మంజూరైన అభివృద్ధి పనుల వివరాలను చర్చించారు. నిధులు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడంతో...