సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం
హెచ్ బి కాలనీ, ఆగస్టు 18, (తెలంగాణ దిశ) : సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన గొప్ప వీరయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు మీర్ పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్ ఫేజ్–1లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన చౌరస్తాలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్లు జెరిపోతుల ప్రభుదాస్, గుండారపు శ్రీనివాస్ రెడ్డి, గొల్లూరి అంజయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ...