18న ట్యాంక్ బండ్ పై సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

కుషాయిగూడ, ఆగస్టు 17, (తెలంగాణ దిశ) : ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్ఠాపనను పురస్కరించుకుని గౌడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మేడ్చల్-మల్కాజిగిరి ఆధ్వర్యంలో ఈసీఐఎల్ చౌరస్తాలో సోమవారం ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గౌడ జేఏసీ రాష్ట్ర కో-కన్వీనర్ ముత్యం ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలిరావాలని, ఉదయం స్థానికంగా జయంతి ఉత్సవాలు ముగించుకుని సాయంత్రానికి ర్యాలీగా ట్యాంక్ బండ్ చేరుకోవాలని పిలుపు నిచ్చారు. ప్రతిష్ఠాపనకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బిసి...