ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో సర్వాయి పాపన్న గౌడ్ జయంతి
కుషాయిగూడ, ఆగస్టు 18, (తెలంగాణ దిశ) : మేడ్చల్ మల్కాజిగిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రతినిధులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంత్ రావు, అసోసియేషన్ అధ్యక్షుడు తాళ్ల ఆనంద్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ముత్యం ముఖేష్ గౌడ్ లతో పాటు పంజాల శ్రీనివాస్ గౌడ్, బుడంపల్లి రఘుపతి గౌడ్,...