పోలీస్ పోటీ పరీక్షలకు టి-సాట్ డిజిటల్ కంటెంట్

సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి శేరిలింగంపల్లి, ఆగస్టు 25, (తెలంగాణ దిశ) :  తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు సిద్ధమయ్యే యువతకు టి-సాట్ నెట్వర్క్ ప్రత్యేక డిజిటల్ కంటెంట్ అందించేందుకు సిద్ధమైంది. పోలిస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహించే 7,437 పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలకు సన్నద్దమయ్యే యువతకు డిజిటల్ పాఠ్యాంశాలను రూపొందించింది. ప్రసారాలకు సంబంధించిన వివరాలను టి-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి ఆదివారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో వివరించారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి యువతకు ప్రత్యేక అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో నియామకాల్లో...