దేశభక్తి నినాదాలతో మార్మోగిన నాగారం.. సెరినిటీ విద్యార్థుల తిరంగా ర్యాలీ

నాగారం, ఆగస్టు 14, (తెలంగాణ దిశ): దేశభక్తిని చాటుతూ నాగారంలోని సెరినిటీ పాఠశాల విద్యార్థులు శుక్రవారం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ ర్యాలీలో విద్యార్థులు జాతీయ జెండాలను చేతబూని దేశభక్తి నినాదాలతో నాగారం పుర వీధులను హోరెత్తించారు. సెరినిటీ పాఠశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ రాంపల్లి చౌరస్తా వరకు కొనసాగింది. అనంతరం రాంపల్లి చౌరస్తా నుంచి నాగారం ప్రధాన వీధుల మీదుగా తిరిగి పాఠశాల వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో త్రివర్ణ పతాకాలను ప్రదర్శిస్తూ...