కల్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాల రద్దుకు కాంగ్రెస్ చేస్తున్న కుట్రను అడ్డుకోవాలి

బిఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి హైదరాబాద్, ఆగస్టు 16, (తెలంగాణ దిశ) :  పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసాకు ప్రతీకగా నిలిచిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బిఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. హైకోర్టు తీర్పును సాకుగా చూపుతూ లక్షలాది పేద కుటుంబాలకు అండగా నిలిచిన ఈ పథకాలను ఎత్తి వేసేందుకు ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ కుట్రను అడ్డుకోవడంతో...