జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి

మంత్రి పొంగులేటిని కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు హైదరాబాద్, ఆగస్టు 17, (తెలంగాణ దిశ) :  జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వం తన విధానాన్ని స్పష్టంగా ప్రకటించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) డిమాండ్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపుతూ అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపులో జాప్యం చేయడం సరికాదని ఫెడరేషన్ నాయకులు పేర్కొన్నారు. సోమవారం టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ తదితరులు సచివాలయంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రెవెన్యూ,...