శారదా నగర్‌లో రోడ్డు సమస్యను తక్షణమే పరిష్కారించాలి
జోనల్ కమిషనర్ రాధికా గుప్తా దృష్టికి తీసుకెళ్లిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్, ఆగస్టు 19, (తెలంగాణ దిశ) : రామంతాపూర్ డివిజన్ శారదానగర్‌లోని ఏడీఆర్‌ఎం గల్లీలో బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నా రోడ్డు మధ్యలో ఉన్న మ్యాన్‌హోల్స్ సమస్య పరిష్కారం కాకపోవడంతో వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. రోడ్డుకు సమానంగా మ్యాన్‌హోల్స్ లేకపోవడంతో వాటి చుట్టూ గుంతలు ఏర్పడి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా ద్విచక్ర...