ప్రజా సమస్యలను ప్రపంచానికి చాటి చెప్పే ఫోటో జర్నలిస్టుల సేవలు అమూల్యం
కూకట్‌పల్లి, ఆగస్టు 19, (తెలంగాణ దిశ) : శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్‌లో కూకట్‌పల్లి ప్రెస్ క్లబ్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజెఎఫ్) ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. టీడబ్ల్యూజెఎఫ్ కూకట్‌పల్లి అధ్యక్షులు ఎర్ర యాకయ్య, ప్రధాన కార్యదర్శి నాగుల అంజిబాబు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను, సమాజంలోని వాస్తవ పరిస్థితులను తమ కెమెరా కళ్లతో ప్రపంచానికి పరిచయం చేస్తూ జర్నలిజంలో విశేష సేవలందిస్తున్న నమస్తే తెలంగాణ...