కాప్రా చెరువులో గణేష్ నిమజ్జనాలకు అవకాశం లేదు
చిన్న విగ్రహాల నిమజ్జనానికి బేబీ పాండ్‌ను వినియోగించుకోవాలి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కాప్రా, ఆగస్టు 29 (తెలంగాణ దిశ) : జీవ వైవిధ్యానికి ప్రతీకగా నిలిచిన కాప్రా చెరువు సాధారణ నీటి వనరు మాత్రమే కాదని, నగర పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలకమైన చిత్తడి నేల ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఈ నేపథ్యంలో కాప్రా చెరువులో గణేష్ విగ్రహాల నిమజ్జనం చేయడం సముచితం కాదని స్పష్టం చేశారు. చెరువు అభివృద్ధి పనులను పరిశీలించేందుకు శుక్రవారం...