మాతృ వియోగంతో ఉన్న జర్నలిస్ట్ బత్తుల సత్యంను పరామర్శించిన టీపీఆర్‌యూఎస్ నేతలు
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 13, (తెలంగాణ దిశ) : మాతృ వియోగంతో బాధలో ఉన్న జర్నలిస్ట్, పోపా జిల్లా సంయుక్త కార్యదర్శి బత్తుల సత్యంను తెలంగాణ పద్మశాలి రిటైర్డ్ యూనియన్ (టీపీఆర్‌యూఎస్) ప్రతినిధులు పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇటీవల సత్యం, ఉపాధ్యాయుడు శ్రీధర్, విశ్రాంత ఉద్యోగి బత్తుల వెంకటయ్యల తల్లి బత్తుల ప్రమీల మృతి చెందారు. గురువారం శివనగర్‌లోని వారి స్వగృహానికి టీపీఆర్‌యూఎస్ జిల్లా అధ్యక్షుడు బిట్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో యూనియన్ ప్రతినిధులు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతురాలి...