ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలపై అధికారులతో చర్చలు
ఉప్పల్, ఆగస్టు 21, (తెలంగాణ దిశ) : ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ శుక్రవారం అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియ అమలు తీరు, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, జోనల్ కమిషనర్ రాధిక గుప్తాతో ప్రభాకర్ సమావేశమై నియోజకవర్గంలోని...