ఉప్పల్‌కు ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్, సమగ్ర డయాగ్నస్టిక్ సెంటర్ మంజూరు చేయాలి
ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి విజ్ఞప్తి ఉప్పల్, ఆగస్టు 18, (తెలంగాణ దిశ) : ఉప్పల్ నియోజకవర్గ ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్‌తో పాటు సమగ్ర డయాగ్నస్టిక్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహను కోరారు. ఈ మేరకు మంత్రి దామోదర రాజనర్సింహకు ఎమ్మెల్యే వినతిపత్రం సమర్పించారు. ఉప్పల్ నియోజకవర్గ జనాభా వేగంగా పెరుగుతున్నప్పటికీ ఈ ప్రాంతంలో...