కృష్ణా జలాలు తరలి పోతుంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తోంది?

బీఆర్‌ఎస్‌ రాష్ట్ర సీనియర్‌ నాయకులు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌, ఆగస్టు 14, (తెలంగాణ దిశ): కృష్ణా నదిలో నీటి లభ్యత ఉన్నప్పటికీ తెలంగాణకు దక్కాల్సిన నీటిని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర సీనియర్‌ నాయకులు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఒకవైపు శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్‌ వైపు నీరు తరలిపోతుంటే, మరోవైపు తెలంగాణ రైతుల కోసం నిర్మించిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంపులు నీటి కోసం ఎదురుచూడటం ఏమిటని ప్రశ్నించారు. బిఆర్‌ఎస్‌ నాయకులు...