స్టేషన్‌ బెయిల్‌ కోసం రూ.5 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన కీసర సీఐ, ఎస్ఐలు

కీసర, సెప్టెంబర్‌ 17, (తెలంగాణ దిశ) : కీసర పోలీస్‌ స్టేషన్‌లో స్టేషన్‌ బెయిల్‌ మంజూరు చేయడంతో పాటు కేసులో ఫిర్యాదుదారు, అతని స్నేహితుడిని వేధించకుండా ఉండేందుకు రూ.5 లక్షలు లంచం డిమాండ్‌ చేసి స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు ఇద్దరు పోలీసు అధికారులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సెప్టెంబర్‌ 16న రాత్రి 11.25 గంటల సమయంలో ఏసీబీ సిటీ రేంజ్‌-1 అధికారులు ఈ దాడి నిర్వహించారు. కీసర పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ అర్కపల్లి అంజనేయులు (ఏఓ-1) సూచనల మేరకు ఎస్‌ఐ ద్యాప...