సెప్టెంబర్ 26 నుంచి ఐదు రోజుల పాటు బ్యాంకులకు సెలవు..!
వరుసగా ఐదు రోజులు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం.. ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచన హైదరాబాద్, సెప్టెంబర్ 21, (తెలంగాణ దిశ) : దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 26 నుంచి 30వ తేదీ వరకు వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. సెప్టెంబర్ 26న నాలుగో శనివారం, 27న ఆదివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు ఉంటుంది. అనంతరం సెప్టెంబర్ 28 నుంచి 30వ తేదీ వరకు బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనుండటంతో వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకులు పనిచేయని పరిస్థితి...