కాప్రా చెరువులో గణేష్ నిమజ్జనానికి అనుమతించాలని కింద కూర్చొని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆందోళన
నిమజ్జనానికి అనుమతి లేదన్న డీసీ.. త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు ఏఎస్ రావునగర్, సెప్టెంబర్ 09, (తెలంగాణ దిశ) : కాప్రా చెరువులో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అనుమతించాలని డిమాండ్ చేస్తూ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బుధవారం నిరసన వ్యక్తమైంది. ఏఎస్ రావునగర్ డివిజన్ పరిధిలోని భవానీనగర్ కమ్యూనిటీ హాల్ లో కాప్రా సర్కిల్ అధికారులు ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవ సమితి సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాప్రా చెరువులో గణేష్ నిమజ్జనాలకు అనుమతించాలని కోరుతూ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ...