చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం
కుషాయిగూడ, సెప్టెంబర్ 10 (తెలంగాణ దిశ) : తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గురువారం ఈసీఐఎల్ చౌరస్తాలోని ఆమె విగ్రహానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవం, మహిళా చైతన్యం, అణగారిన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ సాగించిన పోరాటం చిరస్మరణీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నాటి రజాకారులు, భూస్వాముల దోపిడీకి ఎదురొడ్డి పేదలు, బలహీన వర్గాల హక్కుల కోసం ఆమె చూపిన ధైర్యం, తెగువ తెలంగాణ...