ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం 10న ‘చలో హైదరాబాద్’
పోస్టర్ ఆవిష్కరించిన టీజీఈజేఏసీ నేతలు మేడ్చల్ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 05, (తెలంగాణ దిశ) : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను శనివారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొని పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు...