సెప్టెంబర్ 10న ‘చలో హైదరాబాద్’ను విజయవంతం చేయాలి
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సమస్యలపై ఐక్య ఉద్యమం హైదరాబాద్, సెప్టెంబర్ 02, (తెలంగాణ దిశ) : ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల చిరకాల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా టీజీఈజేఏసీ చైర్మన్ బి. రవి ప్రకాష్ పిలుపునిచ్చారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. హక్కులు, ఆర్థిక భద్రత, సంక్షేమం కోసం చేపడుతున్న ఈ...