గణనాథుని వద్ద 19 రకాల ఆహార పదార్థాలతో అన్న ప్రసాద వితరణ

కాప్రా, సెప్టెంబర్ 25, (తెలంగాణ దిశ) :  యారో యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాప్రా చౌరస్తాలో గత 19 ఏళ్లుగా నిర్వహిస్తున్న వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించి ఉచిత మందులు అందజేశారు. 19 రకాల ఆహార పదార్థాలతో ఉచిత అన్న ప్రసాద వివరణ చేసారు. అలాగే మహిళలకు ప్లేట్లు, బేసిన్లను ఉచితంగా పంపిణీ చేశారు. బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు గోగికర్ శివకుమార్ (జీఎస్‌కే) ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు...