పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాలే మేలు
కుషాయిగూడ పోలీసుల ఆధ్వర్యంలో మహిళలకు మట్టి విగ్రహాల పంపిణీ కుషాయిగూడ, సెప్టెంబర్ 12, (తెలంగాణ దిశ) : వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కుషాయిగూడ పోలీసులు పర్యావరణహిత కార్యక్రమాన్ని చేపట్టారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో స్థానిక మహిళలకు పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కుషాయిగూడ ఎస్‌హెచ్‌ఓ ఎల్. భాస్కర్ రెడ్డి, ఎస్‌ఐలు ఎన్. సుధాకర్ రెడ్డి, ఎం. విజయ్ పాల్గొన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలకు బదులుగా...