శ్రీశ్రీశ్రీ చీర్యాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

విశేష పూజలు, గణపతి హోమం.. భక్తులకు అన్న ప్రసాద వితరణ   కీసర, సెప్టెంబర్ 14, (తెలంగాణ దిశ) : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కీసరలోని శ్రీశ్రీశ్రీ చీర్యాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. దేవాలయ ప్రాంగణంలోని విఘ్నేశ్వర స్వామివారికి ఉదయాన్నే పంచామృత, నవకలశాభిషేకాలు నిర్వహించి, గణపతి హోమం చేపట్టారు. అనంతరం వివిధ రకాల పత్రి, పుష్పాలతో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. వినాయకుడికి ప్రీతికరమైన తుమ్మికూర, ఉండ్రాళ్ల పాయసం, పులిహోర, దద్దోజనం, బెల్లం పొంగలి, సున్నుండలు...